CM Revanth Reddy: బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్లు, ఉప సర్పంచ్‌లకు సీఎం శుభాకాంక్షలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:41 AM
మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధికంగా గెలుపొందారు. ఈ రోజు వారు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపడుతున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 23: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు.. ఈ రోజు అంటే మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దుతారని.. మీరంతా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో.. నవంబర్ 11, 14, 17 తేదీల్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది. మూడు దశల్లో మొత్తం 6821 స్థానాల్లో గెలుపొందింది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 3520 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 703 స్థానాల్లో గెలిచింది. ఇతరులు 1654 స్థానాలను గెలుచుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేశానికి గర్వకారణం మాజీ ప్రధాని పీవీ నరసింహరావు: కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికలు.. సత్తా చాటిన బీజేపీ
For More TG News News And Telugu News