Share News

KTR Pays Tribute To Former PM PV: దేశానికి గర్వకారణం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు: కేటీఆర్

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:18 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత.. పీవీ నరసింహా రావును బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని కేటీఆర్ గుర్తు చేశారు. పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను సైతం కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని చెప్పారు.

KTR Pays Tribute To Former PM PV: దేశానికి గర్వకారణం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు: కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 23: నవభారత నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు భారతదేశానికి గర్వకారణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఆధునిక భారత నిర్మాణానికి బాటలు వేస్తూ.. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు చరిత్రాత్మకమని అభివర్ణించారు. మంగళవారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్థంతి. ఈ సందర్భంగా ఆయనకు కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలను మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత.. పీవీ నరసింహారావును బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను సైతం కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని చెప్పారు. నెక్లెస్ రోడ్డుతోపాటు వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టిందని.. వారి విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసిందని కేటీఆర్ వివరించారు.


అంతేకాదు పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానాన్ని సైతం పంపిందన్నారు. పీవీ నరసింహరావు కుమార్తె వాణిదేవిని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అసెంబ్లీ ఎన్నికలు.. సత్తా చాటిన బీజేపీ

విదేశాల్లో ఉన్నత చదువులు.. 2025లో మారిన వీసా రూల్స్ ఇవే..

For More TG News News And Telugu News

Updated Date - Dec 23 , 2025 | 01:17 PM