Year Ender 2025 Education Stories: విదేశాల్లో ఉన్నత చదువులు.. 2025లో మారిన వీసా రూల్స్ ఇవే..
ABN , Publish Date - Dec 19 , 2025 | 01:34 PM
2025లో గ్లోబల్ స్టడీ వీసా రూల్స్‌లో మార్పుల కారణంగా యూఎస్, యూకే, కెనడా దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది.
2025లో గ్లోబల్ స్టడీ వీసా రూల్స్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఈ వీసా రూల్స్ మార్పుల కారణంగా యూఎస్, యూకే, కెనడా దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆర్థిక విషయాలు, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం, ఎంపిక విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ రూల్స్ కారణంగా అప్రూవల్ రేట్ బాగా తగ్గిపోయింది. ప్రాసెసింగ్ విధానంలో బాగా జాప్యం జరుగుతోంది.
కెనడా : 2025 నుంచి అక్కడి ప్రభుత్వం స్టడీ పర్మిట్లపై దీర్ఘకాల పరిమితిని విధిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా విద్యా రంగంపై తీవ్ర ప్రభావం పడింది. మాస్టర్స్, డాక్టర్ కోర్సుల్లో సీట్లు బాగా తగ్గాయి. అడ్మీషన్ అప్రూవల్ రేట్ బాగా పడిపోయింది. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారికే కెనడా విద్యా సంస్థల్లో చదువుకోవటానికి అవకాశం లభిస్తోంది.
యూకే: ఈ దేశం 2025లో స్టూడెంట్ వీసాల రూల్స్‌లో చాలా మార్పులు చేసింది. గ్రాడ్యూయేట్ రూట్ వీసా గతంలో రెండేళ్ల పాటు చెల్లుబాటు అయ్యేది. దాన్ని 18 నెలలకు కుదించింది. ఈ నిర్ణయం కారణంగా విద్యార్థులు ఆలోచన్లో పడిపోయారు. వీసాల రుసుము, ఫండ్ రిక్వైర్‌మెంట్ బాగా పెరిగింది.
అమెరికా: చాలా ఏళ్లుగా అమలులో ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టాటస్’ విధానానికి అమెరికా ముగింపు పలికింది. మార్పులు చేసిన విధానంతో.. వీసా వాలిడిటీ స్టూడెంట్ అకాడమిక్ ప్రోగ్రామ్‌తో లింక్ చేయబడింది. బ్యాక్ గ్రౌండ్ చెక్స్, రినివల్ ప్రాసెస్ కఠినతరం అయింది.
2026లో విదేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించి మరిన్ని మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కెనడా 2026లో కూడా స్టడీ పర్మిట్ కోటాను కొనసాగించే అవకాశం ఉంది. లేబర్ మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా వర్క్ పర్మీషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. యూకే ఫైనాన్సియల్ చెక్స్‌ను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. డిపెండెంట్స్, పోస్ట్ స్టడీ వర్క్ రూట్స్‌పై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇక, అమెరికా ఫిక్స్‌డ్ టర్మ్ వీసాలను ప్రమాణీకరించే అవకాశం ఉంది. సెక్యూరిటీ స్క్రీనింగ్ సమయాన్ని పెంచే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
డిప్యూటీ సీఎం ధీమా.. ల్యాప్‌టాప్‌ల పంపిణీని ఎవ్వరూ అడ్డుకోలేరు
ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా గంజాయి సరఫరా.. చెక్ పెట్టిన పోలీసులు