Share News

CM Revanth Reddy: ప్రైవేటు విద్యాసంస్థలు తమాషా చేస్తే తాటతీస్తా.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Nov 07 , 2025 | 05:39 PM

ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. కాలేజీలను బంద్‌ చేయించిన వారితో చర్చలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy: ప్రైవేటు విద్యాసంస్థలు తమాషా చేస్తే తాటతీస్తా.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
CM Revanth Reddy Serious On Private Educational Institutions

హైదరాబాద్, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు విద్యాసంస్థల (Private Educational Institutions) నిర్వాహకులు తమాషా చేస్తే తాటతీస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విద్య అనేది సేవ.. వ్యాపారం కాదని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలు సేవ చేయడం లేదు.. వ్యాపారం చేస్తున్నాయని సీరియస్ అయ్యారు. ఇవాళ(శుక్రవారం) గాంధీభవన్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.


విద్యార్థులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ప్రైవేటు విద్యాసంస్థలు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కాలేజీలను బంద్‌ చేయించిన వారితో చర్చలు ఎలా ఉంటాయి..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.


కాగా, ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ప్రైవేటు విద్యాసంస్థలు ఇటీవల బంద్‌కు పిలుపునిచ్చాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశాయి. లేకపోతే నిరవధిక ఆందోళన చేపడతామని హెచ్చరించాయి. తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యాసంస్థలను కొనసాగించడం చాలా కష్టంతో కూడుకున్నదని ప్రైవేటు విద్యాసంస్థలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు విద్యాసంస్థలపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. వివరాలు ఇవే

గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 07 , 2025 | 06:56 PM