Share News

BC Reservation Supreme: నేడు సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్..

ABN , Publish Date - Oct 13 , 2025 | 07:57 AM

స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం నిలిపివేసింది.

BC Reservation Supreme: నేడు సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్..
CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఇవాళ(సోమవారం) బీసీ కోటాపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయనుంది. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుపై సింఘ్వీ, సిద్ధార్థ్ దవేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. ఇందిరా సాహ్నీ కేసు తీర్పు.. బీసీ రిజర్వేషన్లకు అడ్డంకి కాదని ప్రభుత్వ వాదిస్తోంది.

విద్యా, ఉపాధి రంగాలకు మాత్రమే 50 శాతం పరిమితి ఉంటుందని చెబుతుంది. ఈ మేరకు ఇవాళ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ న్యాయనిపుణులతో చర్చలు జరిపి అనంతరం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.


అయితే.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం నిలిపివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటరాదని సుప్రీంకోర్టు విధించిన పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందన్న పిటిషనర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.

దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాలు, ప్రభుత్వ కౌంటర్‌కు ప్రత్యుత్తరం ఇవ్వడానికి పిటిషనర్లకు 2 వారాల సమయం ఇచ్చింది. అనంతరం విచారణను 6 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో జీవో 9పై హైకోర్టు స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది.


ఇవి కూడా చదవండి..

Central Govt: పాఠశాలల్లో యూపీఐతో ఫీజుల వసూలు

Dalit IPS Officer: ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్యలో కొత్తగా అట్రాసిటీ సెక్షన్‌

Updated Date - Oct 13 , 2025 | 08:11 AM