TG Assembly: ఈనెల 4న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. అంత అర్జెంట్‌గా ఎందుకంటే..
ABN , Publish Date - Feb 02 , 2025 | 06:34 PM
TG Assembly: తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణనపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈ నెల 4వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 4వ తేదీ ప్రత్యేకంగా జరుగనుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. 11 గంటలకు కుల గణన సర్వేను సభలో ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే దీని కంటే ముందే బీసీ కులగణనపై ఓ నిర్ణయానికి రావాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే కులగణన చేపట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణనపై చర్చించనుంది. దీని కోసం ఈ నెల 4వ తేదీన అసెంబ్లీ సమావేశం నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
ఇప్పటికే కేబినెట్ సబ్‌కమిటీకి ప్లానింగ్ కమిషన్ అధికారులు కులగణన నివేదిక అందజేశారు. బీసీ రిజర్వేషన్లను పెంచడం కోసం కీలక నిర్ణయం తీసుకుని, పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించి, ఆ తర్వాత కేంద్రానికి పంపే అవకాశాలు ఉన్నాయి. కులగణన సర్వేలో బీసీలు 55.85 శాతం ఉన్నట్లు సబ్‌కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం పథకాలు, రిజర్వేషన్ల అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేయనుంది. దీని కోసం న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రిజర్వేషన్లు అమలు చేయడానికి రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి బీసీల కోటా 40 శాతం పెంచుతామని చెప్పారు. దానికి అనుగుణంగానే 50 రోజుల పాటు కులగణన సర్వే చేయించారు. మొత్తం లక్షా 3,889 మంది అధికారులు సర్వే చేశారు. తెలంగాణలో 96.9శాతం కుటుంబాలు ఉన్నట్లు నివేదికలో తేల్చారు. ఈ సర్వేలో 3 కోట్ల 54 లక్షల మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారు. 3.1శాతం సర్వేలో వివరాలు నమోదు చేయించుకోలేదని నివేదికలో కమిటీ తెలిపింది. అసెంబ్లీలో కులగణనపై చర్చించిన తదుపరి సభ ఆమోదం తెలపనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు.. విచారణ చేస్తున్న పోలీసులు..
KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
Fire Accidents: పాతబస్తీ, జీడిమెట్లలో అగ్ని ప్రమాదం..
Read Latest Telangana News and Telugu News