Gold Case: 26 తులాలు.. కాదు 5 తులాలే..!
ABN , Publish Date - Aug 04 , 2025 | 07:57 AM
చోరీ జరగడం ఒకటైతే.. పోయిన సొత్తు విషయంలో క్లారిటీ లేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. చోరీ అయిన బంగారం 26 తులాలు అని బాధితులు పేర్కొంటుండగా, కాదు కాదు తాము తస్కరించింది కేవలం 5 తులాలే అంటూ నిందితులు పేర్కొంటుండడం ఇందుకు కారణమైంది.
బాధితులు, నిందితుల వేర్వేరు ప్రకటనలు
పోలీసులకు సవాల్‌గా మారిన చోరీ సొత్తు రికవరీ
అల్వాల్, ఆగస్టు3 (ఆంధ్రజ్యోతి): చోరీ జరగడం ఒకటైతే.. పోయిన సొత్తు విషయంలో క్లారిటీ లేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. చోరీ అయిన బంగారం 26 తులాలు అని బాధితులు పేర్కొంటుండగా, కాదు కాదు తాము తస్కరించింది కేవలం 5 తులాలే అంటూ నిందితులు పేర్కొంటుండడం ఇందుకు కారణమైంది. వివరాలిలా ఉన్నాయి. అల్వాల్ పరిధిలోని అంజనాపురికాలనీలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుశాంత్, భార్య పల్లవితో కలిసి ఉంటున్నారు. జూలై 23న దంపతులిద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లికి వెళ్లారు. 28వ తేదీన రాత్రి 10 గంటలకు తిరిగి వచ్చారు. కాగా, ఈ మధ్యలో ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు.
26తులాల బంగారు, 20 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.20వేల నగదు చోరీ అయినట్లు బాధితుడు సుశాంత్ అల్వాల్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురు పాత నేరస్తులతోపాటు చోరీ బంగారం కొన్న సంగారెడ్డికి చెందిన రిసీవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విచారణలో 5 తులాల బంగారు ఆభరణాలను మాత్రమే చోరీ చేసినట్లు నిందితులు చెబుతుండటంతో సొత్తు రికవరీ పోలీసులకు సవాల్‌గా మారింది. పోలీసుల సమాచారంతో ఆదివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సుశాంత్ దంపతులు తమది తప్పుడు ఫిర్యాదు కాదని మీడియాకు వెల్లడించారు. చోరీకి గురైన 26 తులాల బంగారు, ఇతర ఆభరణాలను ఇప్పించాలని వారు వేడుకుంటున్నారు. అయితే, పోలీసులు ఈ కేసును రెండు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించిన పోలీసులు త్వరలోనే కేసు వివరాలు మీడియాకు వివరిస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలు, పిల్లల రక్షణపై స్పెషల్ ఫోకస్
డ్రగ్స్ కేసుల్లో పబ్బులకు లింకులు
Read latest Telangana News And Telugu News