Share News

Jawaharnagar Case: రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో సంచలన విషయాలు..

ABN , Publish Date - Dec 11 , 2025 | 09:54 AM

జవహర్‌నగర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యాపారి హత్యకు కారణమైన వారిని పోలీసులు పట్టుకున్నారు. ఒక మైనర్ బాలుడుతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు.

Jawaharnagar Case: రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో సంచలన విషయాలు..
Jawaharnagar Businessman Case

హైదరాబాద్, డిసెంబరు11(ఆంధ్రజ్యోతి): జవహర్‌నగర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో (Jawaharnagar Businessman Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యాపారి హత్యకు కారణమైన వారిని పోలీసులు పట్టుకున్నారు. ఒక మైనర్ బాలుడుతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. జవహర్‌నగర్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి రత్న కుమారుని కాల్చి, కత్తులతో పొడిచి చందన్ సింగ్(25) చంపేశాడు.


తన తండ్రి ఎన్‌కౌంటర్‌కు రత్నకుమార్ కారణమని పగ పెంచుకున్నాడు చందన్ సింగ్. ఓ బాలుడు సహాయంతో రత్నకుమార్ కదలికలను తెలుసుకున్నాడు. ఆ తర్వాత జొమాటో స్విగ్గీ బాయ్స్ రూపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటికి పంపించి సమాచారం తెలుసుకున్నాడు. రత్నకుమార్ తన పాపని స్కూల్లో వదిలి ఇంటికి వెళ్తున్న సమయంలో కాల్చి చంపేశాడు చందన్ సింగ్. మైనర్ బాలుడుతో పాటు ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. చందన్ సింగ్ దగ్గర నుంచి రివాల్వర్ 15 రౌండ్ల బుల్లెట్స్, కత్తులను జవహర్‌నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

అందుకే ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్స్: డీసీపీ రాజేశ్

Read Latest Telangana News and National News

Updated Date - Dec 11 , 2025 | 10:25 AM