MLC Dasoju Sravan: రేవంత్ రెడ్డికి విషం ఎక్కువ.. విషయం తక్కువ : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
ABN , Publish Date - Aug 16 , 2025 | 06:21 PM
తెలంగాణలో నిర్మాణ రంగం కుదేలవటానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి అని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బ్రాండ్ హైదరాబాద్ క్రియేట్ చేసిందే కేసీఆర్, కేటీఆర్ అని తెలిపారు. నిర్మాణరంగానికి ముఖ్యమంత్రి నమ్మకం కల్పించలేకపోయారని పేర్కొన్నారు.
హైదరాబాద్: సీఎం రేవంత్ సర్కార్‌పై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండలో, క్రెడాయక్ కార్యక్రమంలో సీఎం రేవంత్ సొల్లు పురాణం చెప్పారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి విషం ఎక్కువ.. విషయం తక్కువ.. అని ఎద్దేవా చేశారు. మధ్యతరగతి వాడినని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. తన బూట్లు, బెల్ట్, టీ షర్టులు ఎంత విలువనో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతర వ్యాపారాల మీద ఉన్న యావ రేవంత్‌కు ఇంగ్లీష్ నేర్చుకోవటంలో లేదన్నారు.
తెలంగాణలో నిర్మాణ రంగం కుదేలవటానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి అని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బ్రాండ్ హైదరాబాద్ క్రియేట్ చేసిందే కేసీఆర్, కేటీఆర్ అని తెలిపారు. నిర్మాణరంగానికి ముఖ్యమంత్రి నమ్మకం కల్పించలేకపోయారని పేర్కొన్నారు. బాధ్యత లేని వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఎలా ఉంటుందో చూస్తున్నామని విమర్శించారు. కుక్కతోక వంకర మాదిరి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను వాడుకుని రేవంత్.. బీఆర్ఎస్ నేతలను హింసిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డికి విజన్ లేదు.. విజ్డం లేదని శ్రవణ్ ఆరోపించారు. ఎంత సేపు కేసీఆర్‌ను తిట్టడం, చంద్రబాబును పొగడటం తప్ప ఆయనకు ఏదీ చేత కాదని విమర్శించారు. హైదరాబాద్ అనేది రెవెన్యూ ఇంజిన్ అని పేర్కొన్నారు. నిర్మాణ రంగం బాగుంటేనే అన్ని బాగుంటాయని సూచించారు. కేసీఆర్, కేటీఆర్‌ల చొరవతో హైదరాబాద్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్నారు. హైదరాబాద్ ఇమేజ్ రేవంత్ పాలనలో డ్యామేజీ అయ్యిందని అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీలో భవన నిర్మాణ అనుమతులు తగ్గిపోయాయని పేర్కొన్నారు. హెచ్ఎండీఏలో కార్యకలాపాలు పడకేశాయని తెలిపారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని అడ్డం పెట్టుకుని రేవంత్ బిల్డర్లను బెదిరిస్తున్నారని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కనకగిరి అడవుల్లో నీలిరంగు పుట్టగొడుగు