Minister Uttam: చట్టపరంగా బనకచర్లను అడ్డుకుంటాం: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Jun 25 , 2025 | 06:40 PM
ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్ఎల్‌బీసీ పనులు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఇద్దరు సైనికాధికారులని కేటాయించామని అన్నారు. టన్నేల్ నిర్మాణంలో నిష్ణాతులైన వారి నియామకానికి కసరత్తు చేస్తున్నామని అన్నారు.
హైదరాబాద్: జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఇవాళ(బుధవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. బనకచర్లతో సహా పలు కీలక అంశాలపై మంత్రి ఉత్తమ్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చట్టపరంగా బనకచర్లను అడ్డుకుంటామని అన్నారు. ఈ నెల(జూన్) 30వ తేదీన ప్రజాభవన్‌లో బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు ఎన్డీఎస్ఏ కన్సల్టెంట్‌గా వ్యహరిస్తోందని చెప్పారు. సత్వరమే నాగార్జునసాగర్‌లో పూడిక తీతకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
నీటిపారుదల శాఖలో పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్ఎల్‌బీసీ పనులను పునరుద్ధరిస్తామని చెప్పారు. రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఇద్దరు సైనికాధికారులని కేటాయించామని తెలిపారు. టన్నెల్ నిర్మాణంలో నిష్ణాతులైన వారి నియామకానికి కసరత్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన టన్నెల్ నిపుణులు కల్నల్ పరిక్షిత్ మొహారా జులైలో చేరారని తెలిపారు. నీటిపారుదల శాఖ సలహా దారుడిగా జనరల్ హార్బల్ సింగ్‌కు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. భారత సైన్యంలో ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా జనరల్ హార్బల్ సింగ్ పనిచేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల
ఫోన్ ట్యాపింగ్ కేసు.. తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు
Read latest Telangana News And Telugu News