Share News

BC Population in TG: అందరి అంచనాలు తలకిందులు.. తెలంగాణలో లెక్క తేలిన బీసీ జనాభా.. అధికారికంగా ప్రకటించిన కమిటీ..

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:29 PM

Minister Uttam Kumar Reddy: తెలంగాణలో 96.9 శాతం కులగణన సర్వే జరిగిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు.

BC Population in TG: అందరి అంచనాలు తలకిందులు.. తెలంగాణలో లెక్క తేలిన బీసీ జనాభా.. అధికారికంగా ప్రకటించిన కమిటీ..
Minister Uttam Kumar Reddy

హైదరాబాద్‌: కేబినెట్‌ సబ్‌ కమిటీకి కులగణన నివేదికను ప్లానింగ్‌ కమిషన్‌ అధికారులు ఇచ్చారు. తెలంగాణలో 50 రోజుల పాటు కులగణన సర్వే జరిగింది. 1,03,889 మంది అధికారులతో ప్రభుత్వం కులగణన సర్వే చేయించింది. 96.9 శాతం కుటుంబాలను అధికారులు సర్వే చేశారు. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని కమిషన్‌ స్పష్టం చేసింది. 3.54 కోట్ల మందిని సర్వే చేసినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో 55.85శాతం బీసీ జనాభా ఉన్నట్లు కమిటీ నివేదికలో ప్రకటించింది. తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్‌ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు.


ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌‌గాంధీ ఆశయం మేరకు సామాజిక, కులగణన సర్వే చేశామని అన్నారు. కేబినెట్‌ సబ్‌ కమిటీకి కులగణన సర్వే నివేదిక అందిందని చెప్పారు. తెలంగాణలో 96.9 శాతం కులగణన సర్వే జరిగిందని చెప్పుకొచ్చారు. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సర్వే జరగలేదని అన్నారు. బీసీ జనాభా లెక్కించాలనేది రాహుల్‌ ఆశయమని చెప్పారు. 1,03,889 మంది ఎన్యుమరేటర్లతో కులగణన సర్వే జరిగిందని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3.54 కోట్ల మందిని సర్వే చేశారని చెప్పారు.


ఎల్లుండి ఉదయం 10 గంటలకు కేబినెట్‌ సమావేశం జరుగుతుందని అన్నారు. ఫిబ్రవరి 4న కేబినెట్‌ ముందుకు కులగణన సర్వే నివేదిక తీసుకువస్తామని తెలిపారు. అసలైన పేదలను గుర్తించేందుకే కులగణన చేపట్టామని వివరించారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన జరిగిందని తెలిపారు. కులగణన సర్వే నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెడతామని అన్నారు. అసెంబ్లీ తీర్మానమైన తర్వాత.. బలహీన వర్గాల స్థితిగతుల మెరుగు కోసం చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Gun Firing: హైదరాబాద్ పబ్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. ఏకంగా 23 బులెట్లు

Hyderabad: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు.. విచారణ చేస్తున్న పోలీసులు..

KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

Fire Accidents: పాతబస్తీ, జీడిమెట్లలో అగ్ని ప్రమాదం..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Feb 02 , 2025 | 04:38 PM