Share News

Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్లపై అదిరిపోయే అప్డేట్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:57 PM

Minister Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందని తెలిపారు.ఇచ్చిన ప్రతి మాటను ఆలస్యమైనా నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్లపై అదిరిపోయే అప్డేట్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Minister Ponguleti Srinivas Reddy

ఖమ్మం జిల్లా: అర్హులైన వారికి తప్పకుండా రేషన్ కార్డులు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ(శుక్రవారం) మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. పేదవారి ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని 15 నెలలు అయ్యిందని తెలిపారు. ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీలను కొన్ని పూర్తి చేశాం, మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇళ్లను ఇచ్చే కార్యక్రమం వారంలో ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేని కారణంగా తులం బంగారం కొంత ఆలస్యమవుతుందని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించిందని విమర్శించారు. వాటన్నింటినీ గాడిన పెడుతూ తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ఎక్కడ తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని ఆలస్యమైనా నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Seethakka: అన్నిరంగాల్లో మహిళలకు రేవంత్ ప్రభుత్వం ప్రాధాన్యం

Gudem Mahipal Reddy: కాంగ్రెస్‌పై మరోసారి రెచ్చిపోయిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Rash Driving: మద్యం మత్తులో యువతుల హల్‎చల్.. నడి రోడ్డుపై ఏం చేశారంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 07 , 2025 | 01:03 PM