Share News

Kavitha: జాగృతి జనంబాట యాత్రపై కవిత మరో కీలక నిర్ణయం

ABN , Publish Date - Nov 30 , 2025 | 05:44 PM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్రను డిసెంబర్ 4వ తేదీ నుంచి కొనసాగించనున్నారు. అక్టోబర్ 25వ తేదీన నిజామాబాద్‌లో కవిత జనంబాట యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.

Kavitha: జాగృతి జనంబాట యాత్రపై కవిత మరో కీలక నిర్ణయం
Kalvakuntla Kavitha

హైదరాబాద్, నవంబరు30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ‘జాగృతి జనంబాట యాత్ర’పై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 4వ తేదీ నుంచి జనంబాట కొనసాగించాలని నిర్ణయించారు. అక్టోబరు 25వ తేదీన నిజామాబాద్‌లో కవిత జనంబాట యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.


మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, మెదక్, ఖమ్మం, రంగారెడ్డి, వనపర్తి, కామారెడ్డి జిల్లాల్లో యాత్ర పూర్తి చేశారు. కామారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ రావడంతో గ్రామీణ జిల్లాల్లో యాత్రను నిలిపివేశారు కవిత.


గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ లేని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో డిసెంబరు నాలుగో తేదీ నుంచి ఏడో తేదీ వరకు యాత్ర నిర్వహించాలని భావించారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి కార్యాలయం సవరించిన షెడ్యూల్‌ను ఇవాళ (ఆదివారం) ప్రకటించింది. హైదరాబాద్ జిల్లాలో డిసెంబర్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు యాత్ర చేపట్టనున్నారు కవిత.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18,19 తేదీల్లో, గద్వాల జిల్లాలో 21, 22 తేదీల్లో యాత్ర నిర్వహించనున్నారు. యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, సూర్యాపేట, సిరిసిల్ల, జనగామ, భూపాలపల్లి, ఆసిఫాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, ములుగు, జగిత్యాల, మహబూబాబాద్, నిర్మల్, నారాయణపేట, సిద్ధిపేట, మంచిర్యాల జిల్లాలో ఫిబ్రవరి మూడో వారం వరకు యాత్ర కొనసాగించనున్నారు కవిత.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల నిబంధనను ఉల్లంగిస్తున్నారు.. కవిత ఫైర్

నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం: ఎంపీ సురేశ్‌రెడ్డి

Read Latest TG News and National News

Updated Date - Nov 30 , 2025 | 07:19 PM