Share News

Ibomma Ravi: పోలీసుల విచారణకు సహకరించని ఐబొమ్మ రవి

ABN , Publish Date - Nov 24 , 2025 | 09:46 AM

ఐబొమ్మ రవిని గత నాలుగు రోజులుగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో పోలీసులకు రవి సరిగా సహకరించడం లేదనే వార్తలు వస్తున్నాయి.

Ibomma Ravi: పోలీసుల విచారణకు సహకరించని ఐబొమ్మ రవి
Ibomma Ravi

హైదరాబాద్, నవంబరు24 (ఆంధ్రజ్యోతి): ఐబొమ్మ రవి (Ibomma Ravi)ని గత నాలుగు రోజులుగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో పోలీసులకు రవి సరిగా సహకరించడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈరోజు(సోమవారం)తో రవి ఐదు రోజుల కస్టడీ ముగియనుంది.


వ్యక్తి గత సమాచారం తప్ప పైరసీకి సంబంధించిన వివరాలు ఏవీ రవి పోలీసులకు వెల్లడించలేదు. మరోసారి కస్టడీ పొడిగింపుపై ఆలోచన చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. సినిమాపై ఇష్టంతోనే ఇదంతా చేశానని చెబుతున్నాడు రవి. లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడి.. వివిధ దేశాల్లో ఆయన తిరిగాడని... భారీగానే ఆస్తులు కూడబెట్టారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టారు. రవి ఖాతాలకు సంబంధించిన బ్యాంకులకు లేఖలు రాశారు పోలీసులు. ఐబొమ్మ కేసులో సీఐడీ అధికారులు కూడా దర్యాప్తు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో ఫైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

బీఆర్ఎస్ అగ్ర నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.. కవిత షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 24 , 2025 | 02:22 PM