Share News

Hyderabad Water Supply Disruption: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఆ ఏరియాల్లో తాగునీటి సరఫరాకు బ్రేక్

ABN , Publish Date - Sep 01 , 2025 | 09:10 AM

నగరంలోని పలు ప్రాంతాలకు సోమవారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. లీకేజీ మరమ్మతుల నేపథ్యంలో పనిచేయని వాల్వ్‌లను అధికారులు మారుస్తున్నారు. సోమవారం పనులు ప్రారంభించడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.

Hyderabad Water Supply Disruption: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఆ ఏరియాల్లో తాగునీటి సరఫరాకు బ్రేక్
Hyderabad Water Supply Disruption

హైదరాబాద్ సిటీ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పలు ప్రాంతాలకు సోమవారం తాగునీటి సరఫరాలో అంతరాయం (Water Supply Disruption) ఏర్పడనుంది. ఫేజ్ 3 పంపింగ్ మెయిన్‌కు సంబంధించి 1400 ఎంఎం డయా పైప్‌లైన్‌పైన, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్‌వే, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో నీటి లీకేజీలను అరికట్టడానికి, అత్తాపూర్ మూసీ వంతెన వద్ద 300 ఎంఎం డయా వాల్వ్ ఎక్స్‌టెన్షన్, లీకేజీ మరమ్మతులు, మైలార్‌దేవ్‌పల్లి పంప్ హౌజ్‌లో పనిచేయని వాల్వ్‌లను మార్చేందుకు అధికారులు సోమవారం పనులు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో షేక్‌పేట్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, ప్రశాశన్‌నగర్, తట్టిఖానా, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్పసొసైటీ, కావూరిహిల్స్ పరిసర ప్రాంతాల్లో నీటిసరఫరా ఉండదని వాటర్ వర్క్స్ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. టీజీఎస్పీడీసీఎల్ కొత్త నిబంధనలు

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే..

Read latest Telangana News And Telugu News

Updated Date - Sep 01 , 2025 | 09:18 AM