Hyderabad Woman Kills Children: బాలానగర్‌లో దారుణం.. కవలపిల్లలు చంపి ఆపై తల్లి ఆత్మహత్య..
ABN , Publish Date - Oct 14 , 2025 | 07:29 AM
బాలానగర్ పద్మారావు నగర్ ఫేజ్-1లో చల్లారి సాయిలక్ష్మీ, అనిల్ కుమార్ దంపతులు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలను చంపి తల్లి సాయిలక్ష్మీ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
హైదరాబాద్: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి బిల్డింగ్ పైనుండి దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. రెండు సంవత్సరాల కవలపిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లిను తల్లి చల్లారి సాయిలక్ష్మీ(27) హతమార్చింది. అనంతరం తాను బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాలానగర్ పద్మారావు నగర్ ఫేజ్-1లో చల్లారి సాయిలక్ష్మీ, అనిల్ కుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలను చంపి తల్లి సాయిలక్ష్మీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Government Policy: బాబోయ్ ఇథనాల్
TCS CEO Kriti Vasudevan: కొత్తగా హెచ్-1బీ ఉద్యోగులను నియమించం టీసీఎస్ సీఈవో కృతివాసన్ వెల్లడి