Land Auction: భాగ్యనగరంలో మరోసారి భూముల వేలం.. అమ్మకానికి సిద్ధంగా కోకాపేట, మూసాపేట భూములు
ABN , Publish Date - Nov 24 , 2025 | 10:57 AM
భాగ్యనగరంలో మరోసారి భూముల వేలానికి హెచ్ఎండీఏ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కోకాపేట, మూసాపేట భూములకు సోమవారం నుంచి ఈ వేలం వేయనున్నారు
హైదరాబాద్, నవంబరు24 (ఆంధ్రజ్యోతి): కోకాపేట (Kokapet), మూసాపేట (Moosapet) భూములకు ఇవాళ(సోమవారం) నుంచి ఈ వేలం (Land Auction) వేయనున్నారు హెచ్ఎండీఏ (HMDA) అధికారులు. కోకాపేటలో 29 ఎకరాలతో పాటు మూసాపేట దగ్గర ఉన్న 16 ఎకరాల భూములకు వేలం వేసేందుకు సిద్దమయ్యారు. కోకాపేట నియోపోలీస్‌లో ఒక్కో ఎకరానికి రూ.99 కోట్ల ప్రారంభ ధరను నిర్ణయించారు.
ఈరోజు కోకాపేట్, నియోపోలిస్ వెంచర్‌లోని 17, 18 ప్లాట్లలో ఉన్న 10 ఎకరాలకు ఈ వేలం వేయనున్నారు. నవంబర్ 28, డిసెంబర్ 3,5 తేదీల్లో మిగతా ప్లాట్లకు ఈ వేలం నిర్వహించనున్నారు. కోకాపేట్ నియోపోలీస్ ప్లాట్లకు ఎకరానికి రూ.99 కోట్లు, కోకాపేట గోల్డెన్ మైల్ ప్లాట్లకు రూ.70 కోట్లు, మూసాపేట్ ప్లాట్లకు రూ.75 కోట్ల చొప్పున ప్రారంభ ధరను నిర్ణయించారు. ఈసారి భూముల వేలం ద్వారా భారీగా ఆదాయం వస్తుందని ఆశిస్తున్నారు హెచ్ఎండీఏ అధికారులు. ఇప్పటికే నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి భారీగా రియల్ ఎస్టేట్, డెవలపర్ సంస్థలు హాజరైన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
వీసా రాకపోవడంతో మనస్థాపానికి గురై వైద్యురాలు ఆత్మహత్య
పోలీసుల విచారణకు సహకరించని ఐబొమ్మ రవి
Read Latest Telangana News and National News