Share News

Harish Criticizes Congress Govt: పోలీసులకే రక్షణ లేని పరిస్థితి దురదృష్టకరం: హరీష్ రావు

ABN , Publish Date - Oct 20 , 2025 | 01:06 PM

ముఖ్యమంత్రే హోంమంత్రి అయ్యుండి కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైందని వ్యాఖ్యలు చేశారు.

Harish Criticizes Congress Govt: పోలీసులకే రక్షణ లేని పరిస్థితి దురదృష్టకరం: హరీష్ రావు
Harish Criticizes Congress Govt

హైదరాబాద్, అక్టోబర్ 20: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) ఈరోజు (సోమవారం) దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీమంత్రి మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు మతసామరస్యానికి ప్రతీకగా ఉండేదని గుర్తుచేశారు. చార్మినా‌ర్‌లో అమ్మవారి దేవాలయం ఉండడం.. హిందువులు ముస్లింలను గౌరవించడం, ముస్లింలు హిందువులను గౌరవించడం వంటి సాంప్రదాయాలు ఉన్న గొప్ప సంస్కృతి మనదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేని పరిస్థితి ఉందన్నారు. పోలీస్ కానిస్టేబుల్‌ను ఒక రౌడీషీటర్ చంపడం చాలా దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు.


ముఖ్యమంత్రే హోంమంత్రి అయ్యుండి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని విమర్శించారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైందని వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని...‌ వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు తగ్గిపోయి గుండాల రాజ్యం ఏర్పడిందని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణ, మానాలకు రక్షణ కల్పించే పోలీసులకే రక్షణ లేని పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొని అభివృద్ధిలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగిందని తెలిపారు.


కేబినెట్‌లో ఏం జరిగిందో తాను చెప్పాల్సిన పనిలేదని... స్వయానా మంత్రి కుమార్తెనే చెప్పిందన్నారు. గన్ ఎవరు తెచ్చారనే దానిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తుపాకులు పెట్టి అక్రమార్జన చేస్తున్నారన్న దానిపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేసి నిజానిజాలు తేల్చాలన్నారు. తప్పులు చేయకపోతే మంత్రి ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు స్వర్గధాయంగా మారిస్తే ఈ ప్రభుత్వం తుపాకులు పెట్టి పెట్టుబడిదారులను భయపెడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘పాలన చేస్తున్నారా? వాటాలు పంచుకోవడానికి మీలో మీరు తన్నుకు చస్తున్నారా? మేము అగ్రికల్చర్‌‌ను పెంచితే.. కాంగ్రెస్ ప్రభుత్వం గన్ కల్చర్‌ను పెంచింది’ అంటూ మాజీమంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


ఇవి కూడా చదవండి

కొత్త అల్లుడికి మామ అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఇట్స్ వెరీ స్వీట్

పండగ వేళ.. ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 20 , 2025 | 02:17 PM