Ramchandra Rao: జీఎస్టీ తగ్గించి ప్రజలకు మోదీ బహుమతి ఇచ్చారు: రాంచందర్ రావు
ABN , Publish Date - Oct 20 , 2025 | 11:48 AM
దేశంలోని ప్రజలకు ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గించి బహుమతి ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 20: దేశంలోని ప్రజలకు ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గించి బహుమతి ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా తగ్గాయని చెప్పారు. ధరలు తగ్గినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.
సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి జరుపుకుంటున్నారని.. అధర్మం పై ధర్మం సాధించిన విజయానికి సూచికగా దీపావళి పండుగను జరుపుకుంటాని చెప్పారు. భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేస్తే మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారని రాంచందర్ రావు అన్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Telangana Police: పోలీసులు అప్రమత్తం.. ప్రజలకు కీలక సూచన
Jubilee Hills by-election: ‘జూబ్లీ’ జోరు.. ప్రచార హోరు..