Share News

Gang war in LB Nagar: హైదరాబాద్ కాలేజీలో గ్యాంగ్ వార్ కలకలం

ABN , Publish Date - Aug 12 , 2025 | 01:51 PM

ఎల్బీనగర్‌లో గ్యాంగ్ వార్ రాజుకుంది. ఒకరిపై ఒకరు దాడి విద్యార్థులు చేసుకున్నారు. శుక్రవారం రోజు ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొట్టుకున్న వాళ్లంతా అవినాష్ కాలేజీ విద్యార్థులుగా తెలుస్తోంది.

Gang war in LB Nagar: హైదరాబాద్ కాలేజీలో గ్యాంగ్ వార్ కలకలం
Gang war in LB Nagar

హైదరాబాద్, ఆగస్టు12, (ఆంధ్రజ్యోతి): ఎల్బీనగర్‌లో గ్యాంగ్ వార్ (Gang war in LB Nagar) రాజుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు విద్యార్థులు. శుక్రవారం రోజు ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొట్టుకున్న విద్యార్థులంతా అవినాష్ కాలేజీ వారుగా తెలుస్తోంది. ఒక గ్యాంగ్‌పై మరో గ్యాంగ్ దాడి చేసుకున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. గ్యాంగ్ వార్‌పై ఎల్బీనగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 15మందిపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


అసలు విద్యార్థుల మధ్య వాగ్వాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ విషయంపై కాలేజీ నిర్వాహకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు ఘర్షణ పడుతుంటే కాలేజీ నిర్వాహకులు ఏం చేస్తున్నారని పోలీసులు ప్రశ్నించారు. అయితే ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు పోలీసులు చెప్పారు. అయితే, కాలేజీ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువు చెబుతారని తమ పిల్లలను కాలేజీకి పంపిస్తే కాలేజీ నిర్వాహకులు ఇలాగేనా ప్రవర్తించేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR VS Bandi Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. ఎందుకంటే

తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షం.. నిండుకుండల్లా ప్రాజెక్టులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 12 , 2025 | 02:04 PM