Share News

సికింద్రాబాద్: పోలీసులమని బురిడీ కొట్టించి.. కోటి రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు..

ABN , Publish Date - Jun 19 , 2025 | 09:31 AM

సికింద్రాబాద్, మోండా మార్కెట్: సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్వోటీ పోలీసుల పేరుతో కొందరు కేటుగాళ్లు నగల వ్యాపారిని మోసగించి కోటి రూపాయలు కాజేశారు.

సికింద్రాబాద్: పోలీసులమని బురిడీ కొట్టించి.. కోటి రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు..
Fraudsters cheat Jeweller in Police uniform

సికింద్రాబాద్, క్రైమ్: తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పి ఓ గ్యాంగ్ బంగారు దుకాణం యజమాని నుంచి కోటి రూపాయలు కాజేసింది. సికింద్రాబాద్ పరిధిలోని ఆర్‌కే జ్యువెలరీ యజమానిని ఆరుగురు సభ్యుల ముఠా ఎస్‌వోటీ పోలీసుల పేరుతో మోసం చేసింది. ముందుగా పోలీసు వేషంలో జ్యువెలరీ వ్యాపారి దగ్గరికి వెళ్లిన ఈ గ్యాంగ్.. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే బంగారం విక్రయిస్తామని నమ్మబలికి జ్యువెలరీ షాప్ యజమానితో కోటి రూపాయల బేరం కుదుర్చుకుంది. కానీ, అనుమానం రావడంతో నగలు చూపించాలని వ్యాపారి ముఠా సభ్యులను అడిగాడు. ముఠా సభ్యులు బంగారాన్ని చూపించడంతో నిజమని నమ్మాడు. ప్లాన్ ప్రకారం నకిలీ పోలీసులు కూడా కోటి రూపాయన నగదు చూపించాలని వ్యాపారిని కోరారు.


దీంతో డీల్ ప్రకారం, ఆర్‌కే జ్యువెలరీ యజమాని కోటి రూపాయల నగదు తెచ్చేందుకు సెకండ్ బజార్ లో ఉన్న తన కార్యాలయానికి వెళ్లాడు. నగదు తీసుకొస్తుండగా దార్లో ముగ్గురు వ్యక్తులు ఎస్వోటీ పోలీసుల పేరుతో ఎంట్రీ ఇచ్చారు. వ్యాపారిని బెదిరించి డబ్బు సీజ్ చేస్తున్నామని చెప్పి కారులో పరారయ్యారు. ముఠా చేతిలో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జూబ్లీ బస్ స్టాప్ వద్ద ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేశారు. కాగా, నిందితుల్లో కీలక సూత్రధారిగా ఉన్న 8 వ బెటాలియన్ కు చెందిన కేశవ్ అనే కానిస్టేబుల్ కొట్టేసిన డబ్బుతో పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం..

ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం

For More AP News and Telugu News

Updated Date - Jun 19 , 2025 | 10:23 AM