Share News

Technical Issue: స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం

ABN , Publish Date - Jun 19 , 2025 | 09:00 AM

SpiceJet flight: హైదరాబాద్ నుంచి గురువారం ఉదయం తిరుపతికి బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. మరో 10 నిమిషాల్లో తిరుపతిలో ల్యాండ్ కావలసిన విమానం తిరిగి శంషాబాద్‌కు మళ్లించారు. దీంతో...

Technical Issue: స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం
SpiceJet Flight technical issue

Hyderabad: విమాన ప్రమాదాలు ప్రయాణికులకు దడ పుట్టిస్తున్నాయి. విమానాల్లో ప్రయాణించాలంటే భయపడిపోతున్నారు. అత్యవసర పనులపై తొందరగా గమ్య స్థానాలకు చేరుకోవాలనుకునే వారికి రోజుల వ్యవధిలోనే జరిగిన వరుస ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కూలిపోయి ఏడుగురు దుర్మరణం చెందారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలు దేరిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.


వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ (Hyderabad) నుంచి గురువారం ఉదయం తిరుపతి (Tirupati)కి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం (SpiceJet flight)లో సాంకేతిక లోపం (Technical Glitch) తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. మరో 10 నిమిషాల్లో తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానం తిరిగి (Return) శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు (Shamshabad airport)కు మళ్లించారు. దీంతో తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు తిరిగి శంషాబాద్‌కు రావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ ఫ్లైట్‌ను ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే సాంకేతిక సమస్యపై స్పైస్ జెట్ యాజమాన్యం ప్రయాణికులకు వివరణ ఇవ్వలేదు.


ఈ నెల 16న కూడా...

కాగా ఈ నెల 16న కూడా శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తి పొగలు రావడం ప్రయాణికుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్ 2138 నంబర్ విమానంలో కాలిన వాసన రావడంతో ఫ్లైట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. టేకాఫ్ ముందే విమానాన్ని ఎయిర్‌ పోర్టులో నిలిపివేసి తనిఖీలు చేశారు. అయితే బయలుదేరే క్షణంలో విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఎయిర్ పోర్టులో నిలిపివేయడంతో ప్రయాణికులు మూడున్నర గంటలపాటు ఇబ్బందులు పడ్డారు. కాగా టేకాఫ్ అయిన తర్వాత ఈ సాంకేతిక లోపం మరింత పెద్దగా మారితే ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేవని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.


ఇవి కూడా చదవండి:

ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం

డోనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ షాక్..

జైలుకు వెళ్లే సమయంలో చెవిరెడ్డి నినాదాలు..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 19 , 2025 | 11:30 AM