Share News

Vishnuvardhan Reddy: మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ బతికి ఉంటే.. ఎమ్మెల్యే అయ్యేవాడిని

ABN , Publish Date - Oct 13 , 2025 | 01:32 PM

తనకు కష్టకాంలో బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచిందని విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తనని రెండుసార్లు ఓడించారని గుర్తు చేశారు.

Vishnuvardhan Reddy: మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ బతికి ఉంటే.. ఎమ్మెల్యే అయ్యేవాడిని
Vishnuvardhan Reddy

హైదరాబాద్: తాను ఉన్నంత కాలం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగరనివ్వనని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రహమత్ నగర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ తాతల కాలం నుంచే తమది కాంగ్రెస్ కుటుంబమని గుర్తు చేశారు. తనలాంటి వారికే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ టికెట్‌ను అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చానని స్పష్టం చేశారు.


తనకు కష్టకాంలో బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచిందని విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తనని రెండుసార్లు ఓడించారని గుర్తు చేశారు. అయినప్పటికీ.. ఆయనతో తనకు మంచి సంబంధాలున్నాయని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఎన్నికల కౌటింగ్ సమయంలో ఇద్దరం కలసి తినేవాళ్ళమని చెప్పారు. పీజేఆర్ కొడుకుని ఓడించానని.. గోపినాథ్ సరదాగా తనతో అనేవారన్నారు. గోపినాథ్ బతికి ఉండి ఉంటే.. డీలిమిటేషన్ తర్వాత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అయ్యేవాడిని చెప్పారు. గోపినాథ్ శత్రువులు.. తనకు కూడా శత్రువులే అని కీలక వ్యాఖ్యలు చేశారు. రామన్న రాజ్యం కావాలో..? రావణ రాజ్యం కావాలో.. జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

Central Govt: పాఠశాలల్లో యూపీఐతో ఫీజుల వసూలు

Dalit IPS Officer: ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్యలో కొత్తగా అట్రాసిటీ సెక్షన్‌

Updated Date - Oct 13 , 2025 | 01:48 PM