Share News

Drugs Racket: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

ABN , Publish Date - Jan 19 , 2025 | 08:17 AM

Drugs Racket: భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. పెద్దమొత్తంలో వివిధ రకాల డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను సిటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసినా గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. గ్రామీణ ప్రాంతాల యువత మత్తుకు అలవాటు పడటంతో స్థానికంగా ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది.

Drugs Racket: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
Drugs Racket

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను పట్టి పీడిస్తున్న భూతాల్లో ‘డ్రగ్స్’ ఒకటి. ముఖ్యంగా.. యువతీ యువకులు ఈ డ్రగ్స్‌కు బానిసలై, తమ ఉజ్వల భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇది చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ.. దుండగులు అడ్డదారుల్లో ఈ డ్రగ్స్‌ను సరఫరా చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారులు హైదరాబాద్‌ను ‘డ్రగ్స్ రహిత సిటీ’గా మార్చేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. పంటల్లో చీడపురుగుల్లాగా డ్రగ్స్ అమ్ముతున్న దుండగులను వేటాడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది.


మాదాపూర్‌లో గంజాయి, హాష్ అయిల్ కలకలం సృష్టించింది. 830 గ్రాముల గంజాయితో పాటు 14 గ్రాముల హాష్ అయిల్‌ను శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ టీమ్ సీజ్ చేశారు. ఐటీ క్యారిడార్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే టార్గెట్‌గా కేటుగాళ్లు గంజాయి విక్రయిస్తున్నారు. మాదాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్ రామ్ గూడలో ఉండే విద్యార్థులకు ఓ గ్యాంగ్ గంజాయి అలవాటు చేశారు. మాదాపూర్ సిద్దిఖీ నగర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు గంజాయి విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసు అధికారులు పట్టుకున్నారు. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి గంజాయి, బైక్ సీజ్ చేశారు. ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


డ్రగ్స్‌ను నియంత్రించేందుకు పోలీసులు, ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో రకంగా డ్రగ్స్‌ సరఫరా మాత్రం కొనసాగుతూనే ఉంది. డ్రగ్స్ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్న పోలీసుల హెచ్చరికలను కూడా డ్రగ్ ఫెడ్లర్‌లు పట్టించుకోని పరిస్థితి. షరా మామూలే అన్న చందంగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీసులకు చిక్కడం.. ఆపై బయటకు వచ్చిన తర్వాత కొద్ది కాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ డ్రగ్స్ సరఫరా చేయడం అనేది వారికి పరిపాటిగా మారింది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో చాలా మంది డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు.


పలుమార్లు యువకులు, స్టూడెంట్స్‌ కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విలాసవంతమైన జీవితం గడపాలని, అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో యువత ఈ దారిని ఎంచుకుంటున్నట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయితే తాజాగా మరోసారి భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడటంతో సంచలనంగా మారింది. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే అనర్ధాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గంజాయి క్రయ, విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని. నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad: పోలీసులకు చిక్కిన దోపిడీ దొంగలు?

Hyderabad: ఎన్టీఆర్‌ ఘాట్‌ ఇలానా?

Yadadri Bhuvanagiri: మరణంలోనూ.. 8 మందికి జీవితం

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jan 19 , 2025 | 08:25 AM