Srikanth Iyengar Controversy: శ్రీకాంత్ అయ్యంగార్‌పై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు..
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:50 PM
శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలతో ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్‌పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్‌ను కోరినట్లు చెప్పారు
హైదరాబాద్: ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై మా అసోసియేషన్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పిర్యాదు చేశారు. అనంతరం శ్రీకాంత్ అయ్యంగార్‌పై బల్మూరి వెంకట్ విమర్శలు గుప్పించారు. నిన్న(శనివారం) సైబర్ క్రైమ్‌లో శ్రీకాంత్ అయ్యంగార్‌పైన ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శ్రీకాంత్ అయ్యంగార్, మహాత్మా గాంధీని విమర్శిస్తూ.. సోషల్ మీడియాలో ఉద్దేశ్యపూర్వకంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంతో మంది మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లాడుతున్నారని ఆరోపించారు.
శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలతో ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్‌పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్‌ను కోరినట్లు చెప్పారు. మా అసోసియేషన్ శ్రీకాంత్ అయ్యంగార్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు గుర్తుచేశారు. సినిమా పెద్దలు అందరూ శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే.. పెద్ద హీరోలు శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలపై స్పందించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. అనంతరం మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శివ బాలాజీ మాట్లాడుతూ.. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఈరోజుల్లో ఫ్యాషన్ అయ్యిందని తెలిపారు. మా అసోసియేషన్‌కు డిసిప్లినరీ కమిటీ ఉంది.. దానిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే మా కమిటీ మీటింగ్ పెట్టి.. త్వరలోనే చర్యలు తీసుకుంటామని శివ బాలాజీ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Indigo Flight: విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు
Massive Explosion: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు