Jagga Reddy: కేటీఆర్, రఘునందన్‌పై జగ్గారెడ్డి ఫైర్
ABN , Publish Date - May 06 , 2025 | 08:27 PM
Jagga Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి. జగ్గారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా వీరిద్దరిపై ఆయన నిప్పులు చెరిగారు.
హైదరాబాద్, మే 06: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి. జగ్గారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ నాలుక కొరకడంతో ఏమైతదని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ల నాలుకలు చీరడం సాధ్యమా? అంటూ కేటీఆర్‌ను ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేటీఆర్ సినిమా స్క్రిప్ట్ చదివి డైలాగులు చెప్తాడంటూ ఎద్దేవా చేశారు. సత్తా లేనిదే సీఎం రేవంత్ సంవత్సరంలో రైతులకు రుణమాఫీ చేశారా? అని కేటీఆర్‌ను సూటిగా నిలదీశారు. సత్తా లేనిదే ప్రమాణస్వీకారం చేసిన గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చామా? అని కేటీఆర్‌ను అడిగారు.
తమ ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకోవడం లేదు కానీ.. సంవత్సరంలో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేసీఆర్, హరీష్ రావు సైలెంట్‌గా ఉన్నారు కాబట్టే బీజేపీ ఎంపీగా రఘునందన్ గెలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలవకూడదని కేసీఆర్, హరీష్ రావులు అనుకున్నారు కాబట్టే రఘునందన్ రావు గెలిచారని ఆయన వివరించారు. రాజకీయంగా రఘునందన్ చాలా చిన్నోడన్నారు. నువ్వు నా సీఎంని ఏమనకపోతే నేను మీ పీఎంను ఏం అనక పోదునంటూ రఘునందన్ రావుకు టి. జగ్గారెడ్డి చురకలంటించారు. నల్లధనాన్ని ప్రజలకి పంచుతానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఏమైందంటూ రఘునందన్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని రఘునందన్ రావును ఆయన నిలదీశారు. పదేండ్లు పక్కపక్కన పడుకొని సంసారం చేయలేదా? అంటూ రఘునందన్ రావును వ్యంగ్యంగా ప్రశ్నించారు. ప్రధాని మోదీ.. మోసగాళ్ళకి మోసగాడంటే బీజేపీ వాళ్లు ఫీల్ అవ్వరా? అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని తాము గౌరవిస్తామని.. కానీ రఘునందన్ వల్లే తిట్టాల్సి వస్తుందని ఆయన వివరించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
సోమవారం సాయంత్రం జీ అవార్డ్స్ - 2025 కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని ప్రస్తావించారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాస్తా ఘాటుగా స్పందించారు. వారి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి.జగ్గారెడ్డి పై విధంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sabitha Indra Reddy: కన్నీళ్లతో మెట్లెక్కానంటూ.. గుర్తు చేసుకున్న మాజీ మంత్రి సబిత
Minister P Narayana: రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై కీలక నిర్ణయం
Nadendla Manohar: కొత్త రేషన్ కార్డుల జారీ.. ఎప్పటినుంచంటే..
PAN Card: పాన్ కార్డులో ఎవరికైనా తండ్రి పేరే ఉంటుంది.. ఎందుకో తెలుసా..
Security Mock Drill: హైదరాబాద్‌లోని ఆ నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్.. ఎప్పుడంటే..
India - Pakistan war: యుద్ధానికి సిద్ధమా.. తర్వాత పరిస్థితి ఏమిటి
Minister Satya Kumar: వైద్యులపై హెల్త్ మినిస్టర్‌కు ఫిర్యాదు.. విచారణకు ఆదేశం
CM Chandrababu: ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్
Sabitha Indra Reddy: కన్నీళ్లతో మెట్లెక్కానంటూ.. గుర్తు చేసుకున్న మాజీ మంత్రి సబిత
Read Latest Telangana News And Telugu News