Minister P Narayana: రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై కీలక నిర్ణయం
ABN , Publish Date - May 06 , 2025 | 07:21 PM
Minister P Narayana: గెజిటెడ్ అధికారుల నివాస భవనాలను రూ. 514 కోట్లతో నిర్మాణం చేపడతామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. వాటిలో అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 194 కోట్లు మంజూరు చేసేందుకు సీఆర్డీఏ అనుమతి ఇచ్చిందన్నారు.
అమరావతి, మే 05: గెజిటెడ్ అధికారుల నివాస భవనాలను రూ. 514 కోట్లతో నిర్మాణం చేపడతామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. వాటిలో అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 194 కోట్లు మంజూరు చేసేందుకు సీఆర్డీఏ అనుమతి ఇచ్చిందన్నారు. తొమ్మిది టవర్లలో నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, మౌలిక సదుపాయాలకు అనుమతి సైతం ఇచ్చిందని తెలిపారు. మంగళవారం జరిగిన సీఆర్డీయే 47వ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
అంతకు ముందు జీవోఎం కూడా సమావేశమై.. రాజధానిలో భూ కేటాయింపులపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందుకు సంబంధించిన వివరాలను మంత్రి పి నారాయణ వెల్లడించారు. రూ. 517 కోట్లతో టెండర్లకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. మొత్తంగా రూ. 1732. 31 కోట్లకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అలాగే 190 ఏంఎల్డీల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 568. 57 కోట్లతో టెండర్ పిలిచామన్నారు. 15 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అందుకు రూ. 494 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఇక 3. 5 కిలోమీటర్ల ఈ3 రోడ్డు ఎలివేటెడ్ రోడ్డుకు సైతం అనుమతి ఇచ్చిందని ఆయన వివరించారు.
ఈ 15,13 రహదారులను జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. వీటిని రూ.70, రూ.387 కోట్లలో చేపట్టేందుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. జీవోఎంలోనూ వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అయితే లా యూనివర్సిటీకి 50 ఎకరాలు.. క్వాంటం వ్యాలీకి 50 ఎకరాలు.. బసవ తారకం ఆస్పత్రికి అదనంగా మెడికల్ కాలేజీకి 6 ఎకరాలు కేటాయింపులు చేయాలని నిర్ణయించామని చెప్పారు.
గతంలో ఈ సంస్థకు 15 ఎకరాలు కేటాయింపు జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆదాయపు పన్ను శాఖకు 0.78 ఎకరాలు, రెడ్ క్రాస్ సొసైటీకి 0.78, కోస్టల్ బ్యాంకుకు 0. 40 ఎకరాల కేటాయించామన్నారు. ఐఅర్‌సిటీసికి ఎకరా భూమి కేటాయింపు చేశామని తెలిపారు. ఈ రోజు 7 సంస్థలకు భూ కేటాయింపులను మంత్రుల కమిటీ నిర్ణయించిందన్నారు. గతంలో 64 సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయని చెప్పారు. ఇప్పటి వరకూ రాజధాని ప్రాంతంలో 1050 ఎకరాల మేర భూ కేటాయింపులు జరిగాయని మంత్రి పి.నారాయణ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Nadendla Manohar: కొత్త రేషన్ కార్డుల జారీ.. ఎప్పటినుంచంటే..
PAN Card: పాన్ కార్డులో ఎవరికైనా తండ్రి పేరే ఉంటుంది.. ఎందుకో తెలుసా..
Security Mock Drill: హైదరాబాద్‌లోని ఆ నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్.. ఎప్పుడంటే..
India - Pakistan war: యుద్ధానికి సిద్ధమా.. తర్వాత పరిస్థితి ఏమిటి
Minister Satya Kumar: వైద్యులపై హెల్త్ మినిస్టర్‌కు ఫిర్యాదు.. విచారణకు ఆదేశం
CM Chandrababu: ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్
Sabitha Indra Reddy: కన్నీళ్లతో మెట్లెక్కానంటూ.. గుర్తు చేసుకున్న మాజీ మంత్రి సబిత