CM Revanth Reddy Wishes: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Oct 19 , 2025 | 10:18 PM
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు రేవంత్. దీపాల కాంతులతో ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దీపావళి శుభాకాంక్షలు (Diwali Wishes) తెలిపారు. రెండేళ్ల ప్రజా పాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకువచ్చిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు రేవంత్.
దీపాల కాంతులతో ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి రేవంత్ కోరుకున్నారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్నాపెద్ద ప్రతిఒక్కరూ ఆనందంగా దీపావళి జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు మార్మోగిపోతున్నాయి. టపాసులు, పూజా సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కిక్కిరిపోతున్నాయి.
ఇవి కూడా చదవండి..
దీపాలు, కొవ్వొత్తులకు ఖర్చు దండుగ.. అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి