Share News

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:21 PM

CM Revanth Reddy: తెలంగాణ హై కోర్టులో సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట దక్కింది. గతంలో రిజర్వేషన్ల గురించి రేవంత్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులోనే రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి రేవంత్ రెడ్డికి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. సీఎం హోదాలో బిజీగా ఉండే రేవంత్ రెడ్డి ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరు కాలేరని హైకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. సీఎం కామెంట్‌పై ఎక్సైజ్ కోర్టులో విచారణ జరిగింది. క్వాష్ చేయాలంటూ హైకోర్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశ్రయించారు. ఈ విచారణ జూన్ 12వ తేదీకు రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది.


కాగా, మే 4వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి కొత్తగూడెంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తుందని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ట్రయల్ కోర్టులో నాలుగుసార్లు ఈ కేసు వాయిదా పడింది. దీంతో కాసం వెంకటేశ్వర్లు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ఈ పిటిషన్‌ను కొట్టేసి నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు ఫిర్యాదును పరిశీలించి, న్యాయం చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

MIM: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి విజయం

Counting: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం..

విజయవాడ‌‌లో 'మైండ్ సెట్ షిఫ్ట్' పుస్తకావిష్కరణ‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 25 , 2025 | 12:25 PM