Share News

CM Revanth Reddy: ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Jul 15 , 2025 | 02:20 PM

రాబోయే రోజుల్లో హైదరాబాద్ డేటా సిటీగా మారనుందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలని, అధునాతన విధానాలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాబోయే పదేళ్లలో తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy: ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్: ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ఇవాళ (మంగళవారం) ఐకార్ బయోలజిక్స్​ (ICHOR BIOLOGICS) కొత్త యూనిట్​‌కి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశంలోనే 33 శాతం వ్యాక్సిన్స్ , బల్క్ డ్రగ్స్‌లో 43 శాతం ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయని నొక్కిచెప్పారు. కోవిడ్ సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలదని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి.


ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం మరింత సరళమైన విధానాలతో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ డేటా సిటీగా మారనుందని ఉద్ఘాటించారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 3లక్షల 28 వేల కోట్లు పెట్టుబడులు సాధించామని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలని, అధునాతన విధానాలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాబోయే పదేళ్లలో తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని నొక్కిచెప్పారు. ఇందుకు జీనోమ్ వ్యాలీ పారిశ్రామికవేత్తల సహకారం ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.


ఇవి కూడా చదవండి..

వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం

మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 15 , 2025 | 03:12 PM