Money Laundering Case: మనీలాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం..
ABN , Publish Date - Aug 21 , 2025 | 06:17 PM
మనీలాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర టోష్నీవాల్‌ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ప్రత్యేక PMLA కోర్టు ముందు హాజరుపరచగా శరద్ చంద్ర టోష్నీవాల్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
హైదరాబాద్, ఆగస్టు21, (ఆంధ్రజ్యోతి): మనీలాండరింగ్ కేసులో (Money Laundering Case) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర టోష్నీవాల్‌ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ప్రత్యేక PMLA కోర్టు ముందు హాజరుపరచగా శరద్ చంద్ర టోష్నీవాల్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో పెట్టుబడిదారులను మోసం చేశారని ఈడీ అధికారులు గుర్తించారు.
ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి.. అమాయకులను పెట్టుబడి పెట్టేలా చేసి రూ.792 కోట్లు మోసం చేసినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ స్కామ్‌కి ప్రధాన సూత్రధారి అమర్‌దీప్ కుమార్ కోసం టోష్నీవాల్ పలు నకిలీ లావాదేవీలను నిర్వహించడంతో పాటు.. మనీలాండరింగ్‌లో కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. శరద్ చంద్ర తన బంధువుల పేర్లపై కంపెనీల్లో వాటాలు కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. నకిలీ డబ్బులను ఇతర కంపెనీలకు తరలించడంలోనూ, దాదాపు రూ 14.81 కోట్ల నగదు రూపంలో మార్చడంలోనూ శరద్ చంద్ర కీలక పాత్ర పోషించినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ కేసులో రూ.18.14 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఇప్పటికే ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్, సోదరుడు సందీప్ కుమార్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి
శ్రీశైలంలో కుట్రలు.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం నివేదిక.. హై కోర్టులో వాడివేడిగా వాదనలు
Read Latest Telangana News And Telugu News