Share News

Gowthami Chowdary: టాలీవుడ్ హీరో భార్యపై కేసు నమోదు

ABN , Publish Date - Dec 01 , 2025 | 08:15 PM

టాలీవుడ్ హీరో ధర్మ మహేశ్ భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సోమవారం బిగ్‌బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు  గౌతమి చౌదరిపై కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.

Gowthami Chowdary: టాలీవుడ్ హీరో భార్యపై కేసు నమోదు
Gowthami Chowdary

హైదరాబాద్, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): టాలీవుడ్ హీరో ధర్మ మహేశ్ భార్య గౌతమి చౌదరిపై (Gowthami Chowdary) పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఇవాళ(సోమవారం) బిగ్‌బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గౌతమి చౌదరిపై కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. అనంతరం మీడియాతో శేఖర్ బాషా మాట్లాడారు.


నటుడు ధర్మ మహేశ్‌కు మద్దతుగా మాట్లాడానని.. అందుకే తనను గౌతమి టార్గెట్ చేస్తోందని శేఖర్ బాషా తెలిపారు. బీహార్ రౌడీలను పంపించి చంపేస్తానని గౌతమి బెదిరిస్తోందని శేఖర్ బాషా ఆరోపించారు. తన తల్లి, తన కూతురుపై గౌతమి అభ్యంతకర వ్యాఖ్యలు చేసిందని ఫిర్యాదులో తెలిపారు శేఖర్ బాషా. ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో గౌతమిపై BNS 351(3) 352 , 67 IT Act కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కేటీఆర్ అండ్ కో రెచ్చగొడుతున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మేడారం ఆలయ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 01 , 2025 | 08:28 PM