Car Fire Accident: కారుకింద పేలిన టపాసులు.. కారు దగ్ధం
ABN , Publish Date - Oct 20 , 2025 | 11:18 AM
హైదరాబాద్ – మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని P&T కాలనీలో చోటుచేసుకుంది. పార్క్ చేసిన కారు కింద టపాసులు పేలాయి. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: ఓ కారుకింద టపాసులు పేలి కారు దగ్ధం అయిన ఘటన హైదరాబాద్ – మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని P&T కాలనీలో చోటుచేసుకుంది. కారు పార్కింగ్‌లో ఉన్న సమయంలో.. కారు కింద టపాసులు పేలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైనట్లు సమచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగపోవడంతో.. అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
దీపావళి రోజు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి బాణసంచా, టపాసులు కాలుస్తూ.. సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అయితే టపాసుల వల్ల పండుగ పూట ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటాయి. అందుకే.. దీపావళి వచ్చిందంటే టపాసులతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటారు. ఒక్కోసారి టాపాసులతో.. ఆస్తి నష్టం జరగడమే గాకుండా ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తోంది.
అయితే దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరూ బాణసంచా, టపాసులు కాలుస్తూ.. ఉంటారు. అయితే టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏకాంత ప్రదేశాలలో మాత్రమే టపాసులు వెలిగించాలని పేర్కొన్నారు. రహదారుల్లో టాపాసులు ఎట్టి పరిస్థితుల్లో కాల్చరాదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Maoist Party Expels Leaders: మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు
JEE Main 2026: జేఈఈ మెయిన్-2026షెడ్యూల్ విడుదల