TG News: జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Mar 14 , 2025 | 08:02 AM
Jubilee Hills Car Accident: డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపు తప్పింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

హైదరాబాద్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన నెలరోజుల వ్యవధిలో పలువురు రోడ్డు ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. బడాబాబులు, వాళ్ల పిల్లలే అధికంగా రోడ్డు ప్రమాదాల బారీన పడుతున్నారు. అతిగా మద్యం తాగి కారు డ్రైవింగ్ చేయడం.. ఆ తర్వాత ప్రమాదాలు చేయడం ఇటీవల బాగా కామన్ అయిపోయింది. తాజాగా ఇవాళ(శుక్రవారం) మరో కారు జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించింది.
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ వన్‌లో ఉన్న సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు ఉన్న ఫుట్ పాత్ పైకి కారు దూసుకెళ్లింది. అతివేగంతో, అజాగ్రత్తతో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను కారు ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. మాదాపూర్ వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారును చూసి స్థానికులు పరుగులు తీశారు. ప్రమాదంలో ఫెన్సింగ్‌తో పాటు..కారు ముందు భాగం బాగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..
Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?
Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు
Read Latest Telangana News and Telugu News