Share News

BRSLP Meeting: అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చకు వ్యూహం రచిస్తున్న బీఆర్ఎస్..

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:18 PM

అసెంబ్లీ వాయిదా అనంతరం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్, హరీశ్ రావు సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుచరించాల్సిన వ్యూహంపై వారు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

BRSLP  Meeting: అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చకు వ్యూహం రచిస్తున్న బీఆర్ఎస్..

హైదరాబాద్: మొదటి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. రేపు(ఆదివారం) ఉదయం 9 గంటలకు అసెంబ్లీ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. అయితే రేపు కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ వాయిదా అనంతరం అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ నేతల నిరసన చేపట్టారు. గణపతి బప్పా మోరియా.. కావాలండీ యూరియా.. అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు.


అయితే.. సభ వాయిదా అనంతరం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్, హరీశ్ రావు సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుచరించాల్సిన వ్యూహంపై వారు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎరువుల కొరతపై బీఆర్ఎస్ రేపు వాయిదా తీర్మానం ఇవ్వనుంది. రేపు కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే అసెంబ్లీలో కాళేశ్వరంపై పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే బీఆర్ఎస్ నేతలకు పీపీటీ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వబోమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంలో మరోసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది.


ఇవి కూడా చదవండి:

ఉసిరితోనూ సైడ్ ఎఫెక్ట్స్.. వీటిని ఎవరు తినకూడదంటే..

బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..

Updated Date - Aug 30 , 2025 | 12:52 PM