Bonthu Rammohan: ఎంపీ అర్వింద్ ప్రతిపాదనపై.. కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ రియాక్షన్..
ABN , Publish Date - Oct 09 , 2025 | 09:34 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ ధర్మపురి అర్వింద్ బీజేపీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. బొంతు రామ్మోహన్‌ను పార్టీలోకి తీసుకుని జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని.. బీజేపీ చీఫ్ రామచందర్ రావును ఆయన కోరారు.
హైదరాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిగా.. కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ విషయం తాజాగా.. బొంతు రామ్మోహన్ స్పందించారు. ఎంపీ అర్వింద్ మాటాలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న ప్రచారం అవాస్తవమని తేల్చిచెప్పారు. బీజేపీలో అంతర్గత చర్చకు, తనకు ఎలాంటి సంబంధం లేదని కుండ బద్దలు కొట్టారు. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నాను.. ఉంటాను అని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు.
అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ ధర్మపురి అర్వింద్ బీజేపీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. బొంతు రామ్మోహన్‌ను పార్టీలోకి తీసుకుని జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని.. బీజేపీ చీఫ్ రామచందర్ రావును ఆయన కోరారు. రామ్మోహన్‌కు ABVP బ్యాక్‌గ్రౌండ్ ఉందని ఎంపీ అర్వింద్ తెలిపారు. ఈ నేపథ్యంలో స్పందించిన రామ్మోహన్ అదంతా ప్రచారమని తేల్చి చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కుప్పకూలిన పోలీస్ అధికారి.. అసలేమైందంటే..
రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..