Ramachander Rao Criticizes Congress: అన్నింటిలో విఫలం.. కాంగ్రెస్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ ఆగ్రహం
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:34 PM
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన డిక్లరేషన్లు అమలు చేయడం లేదని రామచందర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ వన్ పోస్టులను కనీసం భర్తీ చేయలేకపోతుందని.. ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని దుయ్యబట్టారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24 : బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ఈరోజు (బుధవారం) జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పదాధికారులకు రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం రామచందర్ రావు మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఇప్పటి వరకు ఒరిగింది ఏమి లేదని విమర్శించారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన డిక్లరేషన్లు అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ వన్ పోస్టులను కనీసం భర్తీ చేయలేకపోతుందని.. ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. ఎంబీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందని ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం విశ్వకర్మ పథకం కింద ఆదుకుంటోందని తెలిపారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని.. ఇందుకు ప్రత్యేక జివో ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని వ్యాఖ్యానించారు. ‘జీఎస్టీ మేం తెచ్చాం.. తగ్గించాం’రామచందర్ వెల్లడించారు. ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. దేశంలో పన్నులు తగ్గించిన ఘనత మోదీది అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కనీసం ఆరోగ్య శ్రీ పథకం నిధులు ఇవ్వలేకపోతోందన్నారు.
యూరియా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని... యూరియా కొరతకు కారణం కాంగ్రెస్ పాలన వైఫల్యమంటూ వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసమే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ పాలన చూశారని.... కాంగ్రెస్ పాలన చూశారని.. ఒక్కసారి బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.
రాష్ట్ర పదాధికారులకు రామచందర్ రావు సూచనలు
‘హైదరాబాద్ వదిలేద్దాం.. గ్రామాలకు వెళదాం. కేంద్ర పథకాలను ప్రజలకు వివరిద్దాం. తెలంగాణకు ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల రూపాయల నిధులను ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను, తప్పిదాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం. జూబ్లీహిల్స్ ఎన్నికలలో విజయం కోసం కష్టపడి పనిచేద్దాం. జూబ్లీహిల్స్, లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
Ongole Earthquake: ఉలిక్కిపడ్డ ఒంగోలు.. అర్ధరాత్రి భూ ప్రకంపనలు..
Read Latest Telangana News And Telugu News