Share News

OG Movie Black Ticket: బ్లాక్‌లో ఓజీ టికెట్లు.. రూ. 800 టికెట్ 2500లకు..

ABN , Publish Date - Sep 24 , 2025 | 10:24 AM

ఆ వ్యక్తి 800 రూపాయల టికెట్లను 2500 రూపాయలకు అమ్ముతున్నట్లు తేలింది. పోలీసులు అతడి వద్దనుంచి 25 సినిమా టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.

OG Movie Black Ticket: బ్లాక్‌లో ఓజీ టికెట్లు.. రూ. 800 టికెట్ 2500లకు..
OG Movie Ticket Black Marketing

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రోజు రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇక, విడుదలకు ముందే ఓజీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే, సినిమా క్రేజ్‌ను కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. బ్లాక్ దందాకు పాల్పడుతున్నారు. ఓజీ సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరా నగర్‌‌లో ఓ వ్యక్తి ఓజీ సినిమా టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.


వారు వెంటనే అక్కడికి వెళ్లి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి 800 రూపాయల టికెట్లను 2500 రూపాయలకు అమ్ముతున్నట్లు తేలింది. పోలీసులు అతడి వద్దనుంచి 25 సినిమా టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతడ్ని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. కాగా, ఈ రోజు (బుధవారం) రాత్రి 10 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్ షో పడనుంది. బెనిఫిట్ షో ధర జీఎస్టీతో కలిపి 1000 రూపాయలుగా ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీనుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లో జీఎస్టీతో కలిపి 125 రూపాయలు..


మల్టీప్లెక్స్‌లలో 150 రూపాయలు అమ్మనున్నారు. తెలంగాణలో ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో పడనుంది. ఆ షో ధర 800 రూపాయలుగా ఉంది. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధర 100 రూపాయలు.. మల్టీప్లెక్స్‌లలో 150 రూపాయలు ఉండనుంది. ఫ్యాన్స్ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఆ ఎదురు చూపుకు తెరపడుతుంది. ఓజీ సినిమా మొదటి రోజు 100 కోట్లకుపైగా కలెక్ట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

గర్భిణులకు పారాసిటమల్ డేంజరా? డోలో బ్రాండ్ అధినేత ఏమన్నారంటే.

జీఎస్టీ బూస్ట్..భారత్ వృద్ధి అంచనాలను పెంచిన రేటింగ్ సంస్థలు, సాధ్యమేనా

Updated Date - Sep 24 , 2025 | 10:56 AM