Share News

TG High Court Big shock For Jagan: జగన్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:40 AM

తెలంగాణ హై కోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై ఉన్న కేసు క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలైంది.

TG High Court Big shock For Jagan: జగన్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ
TG High Court Big shock For Jagan

హైదరాబాద్, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హై కోర్టులో (TG High Court) వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) ఎదురు దెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై ఉన్న కేసు క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై హై కోర్టు ఇవాళ(మంగళవారం) విచారణ చేపట్టింది.


అయితే ఈ కేసులో సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. వాన్‌పిక్ వేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. వాన్‌పిక్ ఓడరేవుకు భూకేటాయింపుల్లో అక్రమాలు, క్విడ్ ప్రోకో జరిగిందంటూ అభియోగాలు మోపారు సీబీఐ అధికారులు. వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భూసేకరణ జరిగిందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పదోన్నతుల్లో రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు అమలు చేయాలి

ఫోన్‌లో ఆర్డర్‌ చేస్తే గంజాయి డెలివరీ

For More TG News And Telugu News

Updated Date - Aug 26 , 2025 | 05:56 PM