All India Equality Forum: పదోన్నతుల్లో రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు అమలుచేయాలి
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:58 AM
పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించాలని ఆలిండియా ఈక్వాలిటీ ఫోరం సెక్రటరీ శ్రీనివాస్, సచివాలయ బీసీ, ఓసీ సంఘ నాయకులు రాజేశ్ డిమాండ్ చేశారు.
అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించాలని ఆలిండియా ఈక్వాలిటీ ఫోరం సెక్రటరీ శ్రీనివాస్, సచివాలయ బీసీ, ఓసీ సంఘ నాయకులు రాజేశ్ డిమాండ్ చేశారు. సోమవారం వారు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్ అధికారుల కమిటీ ఇన్షియల్ క్యాడర్ ప్రాతిపదికగా ప్రమోషన్లలో రిజర్వేషన్ అంశాన్ని పునఃసమీక్షించి, తదనుగుణంగా రివైజ్డ్ ప్యానెల్స్ రూపొందించాలని నివేదిక ఇచ్చిందన్నారు. అయితే ఇప్పుడు కొందరు అధికారులు ఆ రిపోర్టులోని ఇన్షియల్ క్యాడర్ పదాన్ని మార్చి ఫీడర్ క్యాటగిరీ ప్రాతిపదికగా తీసుకోవాలని సవరించి మంత్రివర్గ ఉప సంఘానికి ఇచ్చి తప్పు దోవ పట్టించినట్టు తెలిసిందని చెప్పారు.