Share News

Anantapur: ఫోన్‌లో ఆర్డర్‌ చేస్తే గంజాయి డెలివరీ

ABN , Publish Date - Aug 26 , 2025 | 06:50 AM

ఫోన్‌లో ఆర్డర్‌ చేసి, గంజాయి తెప్పించి విక్రయిస్తున్న ముగ్గురిని అనంతపురం జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు.

Anantapur: ఫోన్‌లో ఆర్డర్‌ చేస్తే గంజాయి డెలివరీ

  • అనంతపురంలో 8.291 కిలోలు స్వాధీనం, ముగ్గురి అరెస్టు

అనంతపురం క్రైం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఫోన్‌లో ఆర్డర్‌ చేసి, గంజాయి తెప్పించి విక్రయిస్తున్న ముగ్గురిని అనంతపురం జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 8.291 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎక్సైజ్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ సీఐ లక్ష్మి సురేఖ, ఎక్సైజ్‌ సీఐ సత్యనారాయణ వెల్లడించారు. గత నెల 18న టీవీ టవర్‌ ప్రాంతంలో తనిఖీలు చేయగా, 418 గ్రాముల గంజాయి దొరికింది. నిఘా ఉంచిన పోలీసులు ఎన్టీఆర్‌ కాలనీ సమీపంలోని మసీదు దగ్గర బుడ్డప్ప నగర్‌కు చెందిన షికారి నాగమణి, ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన షికారి శీనా, వెంగమనాయుడు కాలనీకి చెందిన షికారి జునను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Aug 26 , 2025 | 06:51 AM