Share News

Harish Rao VS Bhatti: కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌‌పై మాటల యుద్ధం..

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:33 AM

మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్‌‌ ఇచ్చే సాంప్రదాయం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని లేఖ కూడా రాసినట్లు గుర్తుచేశారు.

Harish Rao VS Bhatti: కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌‌పై మాటల యుద్ధం..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరంపై అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్‌‌ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నాయకులకు మధ్య మాటలయుద్ధం మొదలయ్యింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.. అసెంబ్లీలో పీపీటీ ఇస్తామని చెప్తుంటే.. కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని ఆరోపించారు. పీపీటీకి అవకాశం ఇవ్వడం లేదంటే.. వాస్తవాలను వినడానికి సిద్ధంగా లేరని అర్థం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాటలు చూస్తుంటే.. ఆయనకు వాస్తవాన్ని అంగీకరించడం ఇష్టం లేదని తెలుస్తోందని చురకులు పెట్టారు. ఏ విషయం గురించైనా నిజానిజాలు కోర్టులో తెలుస్తాయని హరీష్ రావు స్పష్టం చేశారు.


అయితే.. హరీష్ రావు మాట్లాడిన మాటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్‌‌ ఇచ్చే సాంప్రదాయం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని లేఖ కూడా రాసినట్లు గుర్తుచేశారు. అయినా తమకు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. అప్పుడు లేనిది ఇప్పుడు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6500 కోట్లు వడ్డీ కట్టడంలేదని బీఆర్ఎస్ చేస్తోన్న వాదన సరికాదని విమర్శించారు. వడ్డీ తాము కట్టకపోతే.. బీఆర్ఎస్ నేతలు కడుతున్నారా..? అని భట్టి నిలదీశారు.


ఇవి కూడా చదవండి:

ఉసిరితోనూ సైడ్ ఎఫెక్ట్స్.. వీటిని ఎవరు తినకూడదంటే..

బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..

Updated Date - Aug 30 , 2025 | 11:35 AM