MLA Kaleru Venkatesh: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ్ఞప్తి..
ABN , Publish Date - Sep 28 , 2025 | 08:14 PM
మూసరంబాగ్ బ్రిడ్జి స్టార్ట్ అయ్యి రెండేళ్లు అయ్యిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. త్వరగా ఈ బ్రిడ్జి పూర్తి చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. బతుకమ్మ కుంటకు VHR బతుకమ్మ కుంటగా నామకరణం చేయాలనీ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: అంబర్‌పేట సైజులో చిన్నది.. కానీ పేదరికంలో పెద్దదని స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. అంబర్‌పేటలో 5 కిలోమీటర్ల మేర మూసి నది ప్రవహిస్తుందని పేర్కొన్నారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు బిక్కుబిక్కుమని జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్‌పేట నుంచే మూసీ పునరుద్దరణ చేపట్టాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ సరైన స్కూల్స్, గురుకులాలు లేవని చెప్పుకొచ్చారు. స్థలాన్ని కేటాయిస్తే భవనాలని నిర్మించుకుంటామని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ(ఆదివారం) మీడియాతో మాట్లాడారు..
ముసరాంబాగ్ బ్రిడ్జి స్టార్ట్ అయ్యి రెండేళ్లు అయ్యిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. త్వరగా బ్రిడ్జి పూర్తి చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. బతుకమ్మ కుంటకు VHR బతుకమ్మ కుంటగా నామకరణం చేయాలనీ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రాంతం వాడైనా ఈ ప్రజల కోసం చిల్లిగవ కూడా తీసుకురాలేదని ఆరోపించారు. అధికార పక్షం, ప్రతిపక్షం అని కాకుండా తమ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అంబర్‌పేటలో పర్యటించారు. ఈ నేపథ్యంలో జలమండలి నిర్మించిన 6 ఎస్టీపీలను ప్రారంభించి, అమృత్ 2.0 పథకం కింద ఔటర్‌లో మరో 39 ఎస్టీపీ ప్లాంట్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం బతుకమ్మకుంట ప్రారంభోత్సవ వేడుకలలో ఆయన పాల్గొని స్వయంగా మొదటి బతుకమ్మను కుంటలో వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కరూర్ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..
విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలు ఇవేనా..?