Share News

Kaleshwaram Project ON ACB: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం

ABN , Publish Date - Sep 30 , 2025 | 08:17 AM

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నారు.

Kaleshwaram Project ON ACB:  కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం
Kaleshwaram Project ON ACB

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేయనున్నారు ఏసీబీ(ACB) అధికారులు. ఈ ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తు కోరుతూ లేఖ రాసింది తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ డిపార్ట్‌మెంట్. విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ పంపిన లేఖను తెలంగాణ సీఎస్‌కు పంపించారు ఏసీబీ డీజీ. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఏసీబీ విచారణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.


గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఈఎన్సీ, ఈఈ అధికారుల వద్ద భారీగా అక్రమ డబ్బును గుర్తించారు ఏసీబీ అధికారులు. ఏసీబీ విచారణ చేపడితే మరిన్ని ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు విజిలెన్స్ అధికారులు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. మరో గొప్ప పథకం ప్రారంభం

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ.. స్పీకర్‌ నిర్ణయంపై ఉత్కంఠ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 30 , 2025 | 09:30 AM