Share News

Hyderabad Drunk Driving: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భారీగా పట్టుబడ్డ మందుబాబులు

ABN , Publish Date - Dec 07 , 2025 | 09:32 PM

హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. ఈ వారంతపు ఒక్కరోజే 474 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.

Hyderabad Drunk Driving: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భారీగా పట్టుబడ్డ మందుబాబులు
Hyderabad Drunk Driving

హైదరాబాద్‌, డిసెంబర్ 07: నగరంలో వారాంతపు తనిఖీల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్(Hyderabad Drunk Driving) కేసులు నమోదయ్యాయి. శనివారం నిర్వహించిన వారాంతపు తనిఖీలలో మద్యం తాగి వాహనం నడుపుతున్న 474 మందిని పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. వీరి తరువాతి స్థానంలో మూడు, నాలుగు చక్రాల వాహన డ్రైవర్లు ఉన్నారు. తొమ్మిది మందిలో ఆల్కాహాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. తాగి వాహనాలు నడపం అనేది అమాయకుల ప్రాణాలకు ముప్పు తెస్తుందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు(Traffic Police Hyderabad) హెచ్చరించారు


శనివారం 474 మంది మందుబాబులు ట్రాఫిక్ పోలీసుల(Traffic Police Hyderabad) తనిఖీల్లో పట్టుబడ్డారు. వారిలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు - 381 మంది, తరువాత మూడు టైర్ల వెహికల్ డ్రైవర్స్ - 26 మంది, కార్లు వంటి ఇత వాహనదారులు - 67 మంది ఉన్నారు. తొమ్మిది మందిలో 300 ఎంజీ/100 ఎంఎల్ కంటే ఎక్కువ BAC(Blood Alcohol Concentration) స్థాయి నమోదైంది. ఇది అత్యంత ప్రమాదకరం. వాహనదారులు సేవించిన బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ ఆధారంగా పోలీసులు కేసులను వర్గీకరించారు. పట్టుబడిన వారందరినీ సంబంధిత కోర్టు ముందు హాజరుపరుస్తారు.


రోడ్డు ప్రమాదాలను నివారించడం, అమాయక ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమై.. ఎవరైనా మరణిస్తే, భారతీయ న్యాయ సంహిత – 2023లోని సెక్షన్ 105(Indian Penal Code) కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నేరానికి గరిష్ట శిక్షగా 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

ప్రయాణికులకు ఇండిగో రూ.610 కోట్లు రీఫండ్.. పౌర విమానయాన శాఖ వెల్లడి

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 07 , 2025 | 09:40 PM