Hyderabad: 18న ఎన్టీఆర్ మార్గ్‌లో సుందరీమణుల ఫన్‌డే
ABN , Publish Date - May 10 , 2025 | 09:27 AM
ఈనెల18వ తేదీన ఎన్టీఆర్ మార్గ్‌లో సుందరీమణుల ఫన్‌డే ఉన్నందున ట్యాంక్‌బండ్‌పై రాకపోకలు బంద్ చేయనున్నారు. ఆ రోజున ఎన్టీఆర్‌మార్గ్‌లో ఫన్‌డే పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- ట్యాంక్‌బండ్‌పై రాకపోకలు బంద్
హైదరాబాద్: ఈనెల 18న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయాన్ని ప్రపంచ దేశాలకు చెందిన సుందరీమణులు సందర్శించనున్నారు. సచివాలయాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించనున్నారు. ఆ రోజున ఎన్టీఆర్‌మార్గ్‌లో ఫన్‌డే పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం (నేడు) ప్రారంభం కానున్న మిస్ వరల్డ్-2025 పోటీల నేపథ్యంలో ఇప్పటికే హుస్సేన్‌సాగర్ తీరాన గల ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌తో పాటు పర్యాటక ప్రదేశాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కి ‘లేడీ’.. పెళ్లి సంబంధం కుదుర్చుకుని..

నగరంలో చార్మినార్, లాడ్‌బజార్, ఫలక్‌నుమా ప్యాలెస్ తదితర పర్యాటక ప్రదేశాలను సందర్శించనుండడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ట్యాంక్‌బండ్‌పై సండే ఫన్‌డే ఏర్పాటు చేసి ఎలాంటి రాకపోకలు లేకుండా చేయగా, 18న కూడా ఫన్‌డే నిర్వహించి రాకపోకలపై ఆంక్షలు విధించనున్నారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్, చేనేత స్టాల్స్, హస్తకళలకు సంబంధించి స్టాల్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా వినోద కార్యక్రమాలు చేపట్టనున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళారూపాలు ప్రదర్శించే విధంగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు.
పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించండి
ప్రపంచ అందాల పోటీలు ప్రారంభమయ్యే గచ్చిబౌలి స్టేడియం వద్ద పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. అదనంగా పారిశుధ్య కార్మికులను నియమించి పోటీల్లో భాగంగా కార్యక్రమాలు జరిగే వేదికలు, ప్రతినిధులు సందర్శించే పర్యాటక ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాని జోనల్ కమిషనర్లు, పారిశుధ్య విభాగం అధికారులను ఆదేశించారు. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లు, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

ఈ వార్తలు కూడా చదవండి
Drone Attacks: ఉద్రిక్తంగానే..
Miss World 2025: మిస్‌వరల్డ్ పోటీలకు 5వేల మందితో భద్రత
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి
Operation Sindoor: యుద్ధ బీభత్సం
Read Latest Telangana News and National News