Share News

Hyderabad: కి ‘లేడీ’.. పెళ్లి సంబంధం కుదుర్చుకుని..

ABN , Publish Date - May 10 , 2025 | 08:52 AM

ఈ శ్రావణి మహాముదురు.. కాదు కాదు.. దేశముదురు. పెళ్లి సంబంధం కుదుర్చుకున్న ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి పరారయింది. పెళ్లి పేరుతో తనను అనుభవించి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని కొంతమంది మహిళలు రొడ్డెక్కిన వార్తలను మనం చదివి ఉన్నాం. కానీ.. ఇక్కడ అంతా రివర్స్. పెళ్లి చేసుకుంటానని ఓ మడవాడిని నమ్మించి అతగాడి వద్దనుంచి రూ. 10 లక్షలు నొక్కేసింది. ఇక వివరాల్లోకి వెళితే..

Hyderabad: కి ‘లేడీ’.. పెళ్లి సంబంధం కుదుర్చుకుని..

- పెళ్లి సంబంధం కుదుర్చుకుని రూ.10 లక్షలు వసూలు

- యువతి, మధ్యవర్తి పరార్‌

హైదరాబాద్: పెళ్లి చేసుకుంటామని సంబంధం కుదుర్చుకుని అబ్బాయి కుటుంబసభ్యుల నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. కృష్ణానగర్‌(Krishnanagar)కు చెందిన నానీకుమార్‌ వివాహ సంబంధం కోసం వెతుకుతున్నారు. దూరపు చుట్టమైన తాతాజీ శ్రీనివాస్‌ ద్వారా మణికొండకు చెందిన గడ్డం శ్రావణితో సంబంధం కుదిరింది.

ఈ వార్తను కూడా చదవండి: GHMC: సమస్య ఏదైనా.. పరిష్కారానికి యాప్‌


కొద్దిరోజుల తర్వాత తన తల్లిదండ్రులు ఆస్పత్రిలో ఉన్నారని డబ్బు కావాలని శ్రావణి, ఆమె సోదరుడు ప్రతాప్‌, మధ్యవర్తి తాతాజీ పలు దఫాల్లో నానీకుమార్‌(Nani Kumar) నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇప్పుడు వారి ఫోన్లు పనిచేయడం లేదు. దీంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

Drone Attacks: ఉద్రిక్తంగానే..

Miss World 2025: మిస్‌వరల్డ్‌ పోటీలకు 5వేల మందితో భద్రత

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి

Operation Sindoor: యుద్ధ బీభత్సం

Read Latest Telangana News and National News

Updated Date - May 10 , 2025 | 08:52 AM