Share News

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

ABN , Publish Date - May 10 , 2025 | 06:53 AM

Gold Rate Today: నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 98350 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90150 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 73760 దగ్గర ట్రేడ్ అయింది.

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Gold Rate Today

భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరుగుతోంది. పోటాపోటీగా రెండు దేశాలు బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. యుద్ధ ప్రభావం ఇప్పటికైతే సరిహద్దు ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయింది. లోపల ఉన్న ప్రజలు కొంచెం టెన్షన్‌లో ఉన్నా.. వివాహాది ఇతర కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్లలకు ఇతర ఫంక్షన్‌లకు బంగారం కొనాలనుకునే వారికి ఇది గుడ్‌న్యూస్ అని చెప్పొచ్చు. గత కొద్ది రోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ఇప్పుడు తగ్గింది. పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది.


ఈ రోజు బంగారం ధరలు ఇలా..

నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 98350 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90150 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 73760 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, ఈ రోజు 18,22,24 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 98340 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90140 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 73750 దగ్గర ట్రేడ్ అవుతోంది.


వెండి ధరలు ఇలా..

బంగారంతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజూ తగ్గుతూనే ఉన్నాయి. రోజుకు ఎంత లేదన్నా కేజీపై 10 రూపాయలు తగ్గుతోంది. నిన్న 100 గ్రాముల వెండి ధర 11100 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,11,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాములపై 10 రూపాయలు, కేజీపై 100 రూపాయలు తగ్గింది. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 11,090 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ బంగారం ధర 1,10,900 దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

Tamil Nadu: ఏ రాష్ట్రాన్నీ బలవంతంగా ఒప్పించలే

Military: పాక్‌ ఆకాశ నేత్రం నేలమట్టం

Updated Date - May 10 , 2025 | 06:53 AM