GHMC: సమస్య ఏదైనా.. పరిష్కారానికి యాప్
ABN , Publish Date - May 10 , 2025 | 07:52 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆయా సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన యాప్ను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓపక్క సమాచార, సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రజలు తమ సమస్యలను పరిష్కరింపజేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

- పౌరులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సూచన
హైదరాబాద్ సిటీ: సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు, పౌరసేవలు పొందేందుకు మై జీహెచ్‌ఎంసీ యాప్(My GHMC App)ను వినియోగించుకోవాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(GHMC Commissioner RV Karnan) సూచించారు. పారిశుధ్యం, రహదారులు, జనన, వీధి దీపాలు, నాలాల పూడికతీత వంటి సమస్యలపై అక్షాంశం, రేఖాంశం ద్వారా ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ చేసి ఫిర్యాదు చేస్తే వివరాలు నేరుగా సంబంధిత అధికారికి వెళ్తాయన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆన్‌లైన్‌లో మెడిసిన్ కోసం వెదికితే రూ.2.25 లక్షలు కొట్టేశారు..
ఫిర్యాదు పరిష్కారమైందా, లేదా.? అన్న వెసులుబాటు యాప్‌లో ఉందని, పౌరులు ఫీడ్‌బ్యాక్ కూడా యాప్‌లో ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఆస్తి పన్ను చెల్లింపు, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడం, రుసుము చెల్లింపు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం వంటి సేవలూ యాప్ ద్వారా పొందవచ్చన్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయాల లొకేషన్లు, వాతావరణ సూచన, ఇతరత్రా సమాచారమూ అందుబాటులో ఉంటుందన్నారు. యాప్ సేవలను పౌరులు సద్వినియోగం చేసుకోవాలని కర్ణన్ కోరారు.
ఇదిలా ఉండగా అధికారుల తీరుతో ఈ సాంకేతికత అభాసు పాలవుతోందనే విమర్శలు ఉన్నాయి. యాప్ ద్వారా వచ్చే మెజార్టీ ఫిర్యాదులపై యంత్రాంగం స్పందిస్తోన్న దాఖలాలు అరుదు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, సమస్య పరిష్కరించకుండానే ఫిర్యాదు క్లోజ్ చేసినట్టు పౌరులకు సందేశాలు వస్తుంటాయి. కొత్త కమిషనర్ వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తారా, ఎప్పటిలానే జరుగుతుందా అన్నది మున్ముందు చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి
Drone Attacks: ఉద్రిక్తంగానే..
Miss World 2025: మిస్‌వరల్డ్ పోటీలకు 5వేల మందితో భద్రత
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి
Operation Sindoor: యుద్ధ బీభత్సం
Read Latest Telangana News and National News