Hyderabad: అన్ని రాష్ట్రాలకూ హైడ్రా అవసరం..
ABN , Publish Date - Aug 14 , 2025 | 08:05 AM
హైడ్రా వంటి సంస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలని ఢిల్లీ మునిసిపల్ అధికారుల బృందం అభిప్రాయపడింది. హైడ్రా ఉంటేనే చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా ఉంటాయని పేర్కొంది. అంబర్‌పేటలో హైడ్రా పునర్నిర్మించిన బతుకమ్మకుంట చెరువును ఆ బృందం బుధవారం సందర్శించింది.
- 3 నెలల్లో బతుకమ్మకుంట చెరువు నిర్మాణం అపూర్వం: ఢిల్లీ మునిసిపల్ అధికారుల బృందం
హైదరాబాద్: హైడ్రా వంటి సంస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలని ఢిల్లీ మునిసిపల్ అధికారుల బృందం అభిప్రాయపడింది. హైడ్రా ఉంటేనే చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా ఉంటాయని పేర్కొంది. అంబర్‌పేట(Amberpet)లో హైడ్రా పునర్నిర్మించిన బతుకమ్మకుంట చెరువును ఆ బృందం బుధవారం సందర్శించింది. చెరువు చుట్టూ తిరిగి నిర్మాణాలను పరిశీలించింది.
ఒకప్పుడు చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిన ప్రదేశాన్ని మూడు నెలల్లో చెరువులా తయారుచేయడం హైడ్రా గొప్పతనమని పేర్కొంది. ఢిల్లీ బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ ఆశిష్ మాట్లాడుతూ బతుకమ్మకుంట చెరువు అభివృద్ధిపై జాతీయస్థాయిలో చర్చ సాగుతోందన్నారు. కబ్జాల చెర నుంచి చెరువులకు విముక్తి కల్పించడం గొప్ప విషయమని కొనియాడారు.

వేసవిలో రెండు మీటర్ల లోతు తవ్వగానే చెరువులో నీరు ఉబికి వచ్చిన వీడియోలు ఆశ్చర్యం కలిగించాయన్నారు. ఢిల్లీలో కూడా చాలా చెరువులు కబ్జాకు గురయ్యాయని, హైడ్రా వంటి సంస్థతో వాటిని ఆక్రమణల చెర నుంచి విడిపించి, పునర్నిర్మించేందుకు కృషి చేస్తామని చెప్పారు. బతుకమ్మకుంట చెరువు ఇన్‌లెట్, ఔట్‌లెట్‌ల ఏర్పాటు, వాటి పనితీరును హైడ్రా అధికారులను అడిగి తెలుసుకున్నామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్ బెదిరింపులకు భయపడేది లేదు
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి
Read Latest Telangana News and National News